అక్కడ రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘కల్కి’.. ట్వీట్ వైరల్

by Hamsa |
అక్కడ రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘కల్కి’.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి2898ఏడీ’(Kalki 2898 AD). ఈ సినిమా వైజయంతీ ప్రొడక్షన్స్(Vyjayanthi Productions) బ్యానర్‌పై అశ్వనీ దత్(Ashwani Dutt) భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్, దీపికా పదుకొణె(Deepika Padukone), దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కీలక పాత్రల్లో నటించారు. అయితే కల్కి చిత్రం గత ఏడాది జూన్ 27న విడుదల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేయడంతో పాటు పలు రికార్డులు సొంతం చేసుకుంది. కల్కి ఏకంగా రూ. 1000 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘కల్కి 2898’ ఏడీ చిత్రం నేడు జపాన్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ట్వీట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ అభిమానులు అక్కడ కూడా సూపర్ హిట్ అవడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed