గ్రాండ్‌గా అలనాటి స్టార్ హీరోయిన్ బర్త్‌డే పార్టీ.. సందడి చేసిన సినీ తారలు.. వైరల్ అవుతున్న ఫొటోలు

by Kavitha |
గ్రాండ్‌గా అలనాటి స్టార్ హీరోయిన్ బర్త్‌డే పార్టీ.. సందడి చేసిన సినీ తారలు.. వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ చేసి సౌత్ ఇండస్ట్రీలోనే తన కంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదిచుకున్నది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. ఇప్పటికీ ఈమె అందానికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు.

ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీకి సినీ తారలు విచ్చేశారు. అందులో సీనియర్ నటి సంగీత, నటుడు శరత్ కుమార్ అలాగే పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆమెతో కేక్ కట్ చేయించి.. బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం మీనా పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు వాటిని ఓ సారి చూసేయండి.

(VIDEO LINK CREDITS TO MEENA INSTAGRAM ID)

Advertisement

Next Story

Most Viewed