విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎన్ని రోజులంటే?

by Gantepaka Srikanth |
విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎన్ని రోజులంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో దసరా(Dussehra) ఒకటి. బోనాలు, బతుకమ్మ(Bathukamma) తర్వాత అదే రేంజ్‌లో దసరా పండుగను జరుపుకుంటారు. తాజాగా.. దసరా పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నది. కొన్ని ప్రైయివేటు పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా ఈ ఏడాది విద్యాసంస్థలకు 13 రోజుల పాటు దసరా పండగ సెలవులు(Dussehra Holidays) రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed