‘బేబీ జాన్’ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన తమన్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

by Hamsa |
‘బేబీ జాన్’ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన తమన్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్(Varun Dhawan), కలీస్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘బేబీ జాన్’(Baby John). ఇందులో కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్(Salman Khan) కామియో రోల్‌లో నటిస్తున్నాడు. మురాద్ ఖేతానీ, ప్రియా అట్లీ(Priya Atlee), జ్యోతి దేశ్‌పాండే(Jyoti Deshpande) కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ‘బేబీ జాన్’ చిత్రంపై అంచనాలు పెంచుతున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ డిసెంబర్ 14న రాబోతున్నట్లు తెలుపుతూ తమన్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. బందోబస్త్ పోలీస్ సాంగ్ వచ్చేస్తుందని తెలుపుతూ వరుణ్ ధావన్ పవర్ ఫుల్ పోస్టర్‌ను నెట్టింట పెట్టాడు. ఇందులో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story