మీ పిల్లలకు కచ్చితంగా ఇదొక్కటి నేర్పండి: పూరి జగన్నాథ్

by Hamsa |
మీ పిల్లలకు కచ్చితంగా ఇదొక్కటి నేర్పండి: పూరి జగన్నాథ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఇక గత కొద్ది రోజుల నుంచి ఆయన ‘పూరీ మ్యూజింగ్స్’(Puri Musings) పేరుతో వివిధ అంశాలు తెలియజేస్తున్నారు. నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా, పూరి జగన్నాథ్ పిల్లలకు ఈ ఒక్క విషయాన్ని కచ్చితంగా నేర్పాలని అంటున్నారు. ‘‘ఇవన్నీ మనకు జోక్‌లా అనిపించవచ్చు. కానీ ఒక మంచి అలవాటుని తర్వాత తరాలు మర్చిపోకుండా పాటించాలంటే వాళ్లు చేసే పనిమీద భక్తిని పెంపొందించాలి. చిన్నప్పుడే ఇంట్లో పనులు చెప్పడం, వస్తువులు సర్ది పెట్టడం చిన్నారులకు నేర్పాలి. పరిశుభ్రంగా ఉండటం అలవాటైతే తెలియకుండా ఇంకెన్నో మంచి అలవాట్లు వస్తాయి. కాబట్టి చిన్న పిల్లలకు శుభ్రత నేర్పండి చాలు తర్వాత వారు అన్ని నేర్చుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు.



Advertisement

Next Story