Tamannaah: ‘స్త్రీ 2’ సినిమా హిట్ అయిందే నా వల్ల.. మిల్క్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

by Kavitha |
Tamannaah: ‘స్త్రీ 2’ సినిమా హిట్ అయిందే నా వల్ల.. మిల్క్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో దాదాపు స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ భామ ఎక్కువగా స్పెషల్ సాంగ్స్‌లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అలా జైలర్, ‘స్త్రీ2’ వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “‘స్త్రీ 2’ సక్సెస్‌కి కారణం ‘ఆజ్ కీ రాత్’ అనే పాటే. ఈ సాంగ్‌లో నేను నా ప్రాణం పెట్టి నటించాను అందుకే ఈ సినిమా ఇంతలా హిట్ అయింది” అని మిల్క్ బ్యూటీ చెప్పుకొచ్చింది. కాగా 2018లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో డైరెక్టర్ అమర్ కౌశిక్ స్త్రీ 2వ భాగాన్ని కూడా తెరకెక్కించారు. ఇక రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ రీసెంట్‌గా విడుదలై మంచి విజయం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed