సూపర్ హిట్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మేకర్స్

by Hamsa |
సూపర్ హిట్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), లక్ష్మణ్ ఉటేకర్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. దివ్యా దత్తా, అక్షయ్ ఖన్నా(Akshaye Khanna), అషుతోషి రానా కీలక పాత్రలో నటించారు. అయితే ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 483 కోట్లు రాబట్టినట్లు టాక్. అయితే ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో.. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ‘ఛావా’(Chhaava)తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్చానర్‌పై తెలుగు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలని అల్లు అరవింద్(Allu Aravind) నిర్ణయించుకున్నారట. తాజాగా, ఈ విషయంపై మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అందరి డిమాండ్ మేరకు తెలుగులో ‘ఛావా’ సినిమాను మార్చి 7న రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story