- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమంత సినిమాలో వివాదాస్పద క్రికెటర్.. ఆ పాత్ర కోసమే..
దిశ, వెబ్‌డెస్క్: సమంత సినిమాల విషయంలో స్పీడ్ పెంచేసింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా సామ్ చేస్తున్న తమిళ సినిమా 'కాతు వాకుల రెండు కాదల్'. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ కనిపించనున్నాడు. శ్రీశాంత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2013 ఐపీఎల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ కారణంగా క్రికెట్‌కు దూరమయ్యాడు.
శ్రీశాంత్ ఇప్పటికే హిందీ, మలయాళం, కన్నడ సినిమాల్లో కనిపించాడు. తాజాగా అతడు తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ మూవీలో నయనతార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో శ్రీశాంత్ ఫస్ట్ లుక్‌ను శ్రీశాంత్ బర్త్ డే స్పెషల్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మహమ్మద్ మొబి అనే పాత్రలో నటిస్తున్నాడు. శ్రీశాంత్ పాత్ర ఎలా ఉంటుంది, నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అనేది ఏమీ తెలపలేదు. అది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.