సినిమా ఒకే చేసేందుకు డైరెక్టర్లకే కండీషన్లు పెడుతున్న శ్రీలీల..!

by Hamsa |   ( Updated:2023-11-13 09:54:21.0  )
సినిమా ఒకే చేసేందుకు డైరెక్టర్లకే కండీషన్లు పెడుతున్న శ్రీలీల..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘పెళ్లి సందడి’ మూవీతో అందరికీ పరిచయం అయింది. ఆ తర్వాత ధమాకా సినిమాలో తన నటన, డ్యాన్స్‌తో ఆకర్శించింది. ఇక ఈ మూవీ హిట్ అందుకోవడంతో అందరి స్టార్ హీరోల దృష్టి ఈ బ్యూటీ పైనే పడింది. దీంతో మహేష్ బాబు, పవన్ కల్యాణ్, బాలయ్య, వంటి వారు ఆమెనే తమ సినిమాలో ఉండాలి ఎంపిక చేసుకున్నారు. అయితే శ్రీలీల, బాలయ్య కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన భగవంత్ కేసరి సూపర్ డూపర్ హిట్ అయింది. త్వరలోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీలో శ్రీ లీల సినిమా ఒప్పుకోవడానికి ప్రతి ఒక్క డైరెక్టర్‌కి ఓ క్రేజీ కండిషన్ పెడుతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ముందుగా అడిగితేనే కాల్ షీట్స్ ఇస్తుందట. సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక ఎక్స్ట్రా అడిగితే ఇవ్వను అని చెప్పుకొస్తుందట. అంతేకాదు శ్రీ లీల కాల్ షీట్స్ విషయంలో చాలా చాలా కేర్ ఫుల్‌గా వ్యవహరిస్తుందట. ఆమె కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమాలు తన వల్ల షూట్ లేట్ అయినా పోస్ట్ పోన్ అయినా చాలా బాధపడుతుందట. అందుకే ముందు నుంచే జాగ్రత్త పడుతూ కాల్ షీట్స్ విషయంలో మాత్రం డైరెక్టర్స్‌కు తెగేసి చెప్పేస్తుందట.

Advertisement

Next Story

Most Viewed