Unstoppable: అన్‌స్టాప‌బుల్ నుండి శ్రీలీల, నవీన్ పొలిశెట్టి ప్రోమో వచ్చేసింది!

by Prasanna |
Unstoppable: అన్‌స్టాప‌బుల్ నుండి శ్రీలీల, నవీన్ పొలిశెట్టి ప్రోమో వచ్చేసింది!
X

దిశ, వెబ్ డెస్క్ : నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Balakrishna) హోస్ట్ గా చేస్తున్న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 4 ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే, ఈ సీజన్ 5 ఎపిసోడ్స్ ను పూర్తిచేసుకున్న ఈ షో నిన్న ఆరవ ఎపిసోడ్ గ్లింప్స్ ను విడుదల చేశారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, నటుడు నవీన్ పొలిశెట్టి ఈ ఎపిసోడ్ కి గెస్ట్ లుగా వెళ్ళారు.

కాగా, నేడు యంగ్ హీరోయిన్ శ్రీలీల ( Sreeleela), హీరో నవీన్ పొలిశెట్టి ( Naveen Polishetty ) ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్యతో వీరిద్దరూ డ్యాన్స్ లు వేశారు. బాలయ్య ఎనర్జీ తగ్గట్టు శ్రీలీల కూడా బాగానే అలరించింది. అంతే కాకుండా, సినిమాలకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పటికే బాలయ్య, శ్రీలీల కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.

అలాగే శ్రీలీల, నవీన్ నవీన్ పొలిశెట్టితో బాలయ్య కొన్ని ఆటలు ఆడించారు. నటీ, నటుల గురించి కూడా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. బాలయ్యతో పుష్ప 2 కిస్సిక్ పాటకి స్టెప్పులు కూడా శ్రీలీల వేసింది. ఈ ప్రోమో మొత్తం కొంచం కామెడీగా , కొంచం సరదాగా సాగింది.

Advertisement

Next Story