షాకింగ్.. ‘పుష్ప-2’ నుంచి ఆ సాంగ్ డిలీట్.. కారణం ఏమిటంటే..?

by Kavitha |
షాకింగ్.. ‘పుష్ప-2’ నుంచి ఆ సాంగ్ డిలీట్.. కారణం ఏమిటంటే..?
X

దిశ, సినిమా: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. తన కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఎ 11 గా ఉన్న అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం, అతను బెయిల్ పై బయటకు రావడం జరిగింది. అయితే ఈ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి మూవీ టీమ్ రూ.2 కోట్ల పరిహారంతో పాటు, రేవతి భర్తకి సినీ ఇండస్ట్రీలో పర్మినెంట్ జాబ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పుష్ప-2 చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా పుష్ప సినిమాలోని దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం T SERIES తెలుగు చానల్లో ఈ వీడియో కనిపించడం లేదు. కాగా, అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించిన రోజు డిసెంబర్ 24 సాయంత్రం ఈ సాంగ్‌ను టీ సిరీస్ విడుదల చేసింది. అయితే ఈ పాట పోలీసులను ఉద్దేశించే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ పాటను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed