- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Divya : రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నటుడు సత్యరాజ్ కూతురు

దిశ, వెబ్ డెస్క్ : బహుబలి నటుడు సత్యరాజ్ ( కట్టప్ప ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఎవరూ ఊహించని విధంగా అతని కుమార్తె దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. చెన్నైలో సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీలో 2025 జనవరి 19 వ తేదీన అధికారికంగా చేరారు. ఈ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, మంత్రులు పీకే శేఖర్ బాబు, కేఎన్ నెహ్రూ పాల్గొన్నారు.
పార్టీలో చేరిన దివ్య సత్యరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. " డీఎంకే ఆడవాళ్ళను గౌరవించే పార్టీ అని, అందుకే తాను ఈ పార్టీలో చేరానని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి ఉచిత అల్పాహార పథకం ద్వారా పౌష్టికాహారానికి డీఎంకే ప్రాధాన్యనిస్తుందని అన్నారు. అంతే కాకుండా, ఈ పార్టీ అన్ని మతాలను వారిని సమానంగా చూస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తనపై నమ్మకం ఉంచినందుకు చాలా థాంక్స్. డీఎంకే మార్గదర్శకత్వంలో ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని" తెలిపింది.