Sharwanand: ‘శర్వా-37’ టైటిల్ ఫిక్స్.. ఇద్దరి భామల మధ్య నలిగిపోతున్న చార్మింగ్ స్టార్

by Hamsa |
Sharwanand: ‘శర్వా-37’ టైటిల్ ఫిక్స్.. ఇద్దరి భామల మధ్య నలిగిపోతున్న చార్మింగ్ స్టార్
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand), సంయుక్తా మీనన్(Samyukta Menon), సాక్షి వైద్య(Sakshi Vaidya) నటిస్తున్న తాజా చిత్రం ‘శర్వా-37’. దీనిని సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) తెరకెక్కిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), నందమూరి బాలకృష్ణ(Balakrishna) చేతుల మీదుగా విడుదల చేయించారు. అయితే ‘శర్వా-37’ బాలయ్య ఆల్ టైమ్ సూపర్ హిట్ ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇద్దరు భామలు అరుస్తుంటే.. శర్వానంద్ మధ్యలో నలిగిపోతూ చెవులు మూసుకుని కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Advertisement

Next Story

Most Viewed