- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శోభితతో జీవితాన్ని పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది.. భార్యని పొగడ్తలతో ముంచెత్తిన నాగ చైతన్య

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్(Geeth Arts Banner)పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. యథార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లవర్స్ కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
అయితే విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించిన నాగ చైతన్య తన భార్య శోభిత ధూళిపాళ(Shobhita Dhulipala) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘శోభితతో జీవితాన్ని పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం నాకు ఇష్టం. నా ఆలోచనలన్నింటినీ ఆమెతో చెబుతుంటాను. నేను ఎప్పుడైనా గందరగోళానికి గురైనప్పుడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్తాను. అలాగే నేను ఏ కాస్తా ఒత్తిడికి లోనైనా కూడా తనకు తెలిసిపోతుంది. ‘ఏమైంది ఎందుకు అలా ఉన్నావు’ అని అడుగుతుంది.
అన్ని విషయాల్లో తను నాకు గొప్ప సలహాలు, సూచనలు ఇస్తుంటది. ఆమె అభిప్రాయాలు ఎంతో తటస్థంగా ఉంటాయి. ఆమె నిర్ణయాన్ని నేను ఎంతగానో గౌరవిస్తా. ప్రతీది ఆమె నిర్ణయం తీసుకున్నాకే ఒక ఫైనల్ డెసిషన్‌కి వస్తా’ అని భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సమంత(Samantha)తో విడాకుల తర్వాత నాగ చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉన్నాడు. వీరిద్దరు కలిసి వేకెషన్స్‌కి వెళ్లినవి, హోటల్‌లో ఉన్న ఫొటోలు మీడియాకి చిక్కాయి.
కానీ వీరు తమ రిలేషన్ షిప్ గురించి ఏమీ మాట్లాడకుండా సడెన్‌గా ఎంగేజ్‌మెంట్(engegement) చేసుకుని షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నెట్టింట వీరికి సంబంధించిన న్యూస్ ఏదో ఒక విధంగా వైరల్ అవుతునే ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరు డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక మ్యారేజ్ తర్వాత చైతన్య సినిమాలు చేస్తుంటే, శోభిత మాత్రం సోషల్ మీడియా(Social Media)లో నిత్యం లేటెస్ట్ ఫొటోలతో అభిమానులకు దగ్గరవుతూ ఉంది.