Shanmukh Jaswant: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. షణ్ముఖ్‌ జస్వంత్‌ కామెంట్స్ వైరల్

by sudharani |
Shanmukh Jaswant: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. షణ్ముఖ్‌ జస్వంత్‌ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ట్యాలెంటెడ్ యాక్టర్ షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswant) లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘లీలా వినోదం’ (Leela Vinodam). అనగ అజిత్‌, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాని డైరెక్టర్ పవన్‌ సుంకర (Pawan Sunkara) తెరకెక్కిస్తున్నారు. శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మారిసా నిర్మించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ (teaser), ట్రైలర్‌ (Trailer)కు మంచి రెస్పాన్స్ లభించగా.. ఈ చిత్రం ఈటీవీ విన్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌ని నిర్వహించారు.

ఈ సందర్భంగా షణ్ముఖ్‌ జస్వంత్‌ మాట్లాడుతూ: ‘నేను కంటెంట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది. అయినప్పటికీ ఎంతగానో సపోర్ట్ (Support) చేస్తున్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు కరెక్ట్ టైంలో 'లీలా వినోదం' వచ్చింది. భరత్, సాయికి థాంక్యూ సో మచ్ (Thank you so much). నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. వారి పట్ల ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. ఈ సినిమా మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. అందరూ కష్టపడ్డారు. కొత్త కాన్సెప్ట్‌ (New Concept)తో వస్తున్నాం. నన్ను సపోర్ట్ చేయమని అందరినీ కోరుతున్నాను. లీలా వినోదం టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. డిసెంబర్ 19 నుంచి ఈటీవీ విన్‌లో మా వినోదం స్ట్రీం అవుతుంది. తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed