- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ బుల్లి రాజు తండ్రి.. కారణం అదేనంటూ సంచలన పోస్ట్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా మొదటి షో నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్లుగా నటించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. ఇందులో వెంకటేష్ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు (రేవంత్ భీమాల) ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. స్క్రీన్‌పై తన మాటలు, మాస్ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. ఇక అప్పటి నుంచి బుల్లి రాజు కు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల బుల్లి రాజు విశ్వక్ సేన్(Vishwak Sen) ‘లైలా’ ప్రమోషన్స్ పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అయితే లైలా పిన్నితో వాల్ల నాన్నకు పెళ్లి చేయాలంటూ విశ్వక్‌సేన్‌తో కలిసి వీడియోలు చేశాడు.
ఈ క్రమంలోనే.. బుల్లిరాజు పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సంచలన పోస్ట్ పెట్టడంతో అంతా తిట్టిపోస్తున్నారు. అయితే ఇందులో ఏముందంటే.. ‘‘పేటియం గాళ్లు బాగా కష్టపడ్డారు కానీ, బ్రతుకులు ఎందుకురా? దొంగ ఓట్లతో గెలుద్దాం అనుకున్నప్పుడే మీకు 11 వచ్చాయి. బోట్స్‌తో కాదురా దమ్ముంటే దొమ్మ చూపించి రండిరా.. 10 నిమిషాల్లో 30వేల బోట్ ఓట్లు వేయించారంటే మీరు ఎంత ఫేక్ బతుకు బతుకుతున్నారో ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. మీరు ఎంత గింజుకున్నా అకౌంట్ డిలీట్ చెయ్యనులే! మీరు ఇది ఫేక్ బతుకు బతికితే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు’’ అని ఉంది. అయితే అది ఫేక్ అకౌంట్ అని తెలియక అంతా బుల్లిరాజుపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఆ బుడ్డోడు తండ్రి ఈ విషయంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ‘‘మా అబ్బాయి రేవంత్ నటించిన సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. మీ ఆదరణము కృతజ్ఞతలు. అయితే కొన్ని రోజుల నుంచి మా అబ్బాయి పేరు మీ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన వీడియోలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే మా అబ్బాయికి సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం కేవలం రేవంత్ భీమ్లాపేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాం. ఇది తప్ప మాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్ లేదు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న విషయంపై పోలీస్ వారికి ఫిర్యాదు చేశాం. దయచేసి మాకు ముఖ్యంగా మా అబ్బాయిని ఇటువంటి వివాదాలు, రాజకీయాలతో ముడి పెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నాం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మంచి పని చేసారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.