నాగ చైతన్య గుర్తుగా ఉన్న ఒకే ఒక్క మెమోరీను కూడా చెరిపేసిన సమంత.. దయచేసి మళ్లీ అలా చేయకు అని నెటిజన్ల కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-03-17 14:27:51.0  )
నాగ చైతన్య గుర్తుగా ఉన్న ఒకే ఒక్క మెమోరీను కూడా చెరిపేసిన సమంత.. దయచేసి మళ్లీ అలా చేయకు అని నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మనందరికీ సుపరిచితమే. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.

చివరగా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) సిరీస్‌తో మనముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’(Raktha Brahmand) మూవీతో పాటు తన సొంత నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. అలాగే తన నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్టు ‘శుభం’(Movie) మూవీ చిత్రీకరణ కూడా స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. నిన్న సమంత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫొటోల్లో సమంత చేతిపై ఉన్న టాటూ గురించి నెటిజన్స్ అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. సామ్ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరూ చేతి పైన సేమ్ టాటూ వేయించుకున్నారు. అయితే ఇప్పుడు సమంత ఆ టాటూను తొలగించిందని ఫొటో చూస్తే అర్ధమవుతుంది. అయినా కూడా ఆ టాటూ కొద్దికొద్దిగా కనిపిస్తుంది. దీంతో నెటిజన్స్.. చైతన్య గుర్తుగా ఉన్న ఒకే ఒక్క మెమోరీను కూడా సామ్ తొలగించేసిందని, దయచేసి మళ్లీ ప్రేమలో పడి ఇలా టాటూలు వేయించుకోకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

READ MORE ...

మరోసారి ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న అనుపమ.. ఇది కూడా పక్కా బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్


Next Story

Most Viewed