- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ram Gopal Varma: ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకే ఒక్కడు.. బిగ్గెస్ట్ స్టార్ అతడేనంటూ ఆర్జీవీ ట్వీట్
దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ప్రస్తుతం ‘శారీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో బన్నీని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. అందరికంటే గొప్పవాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, అల్లు అర్జున్(Allu Arjun)పై మరోసారి ప్రశంసలు కురిపించారు.
‘‘1913లో మొదటి సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ‘పుష్ప-2’ లాంటి మూవీ రాలేదు. ఈ వందేళ్లలో బిగ్గెస్ట్ స్టార్, మెగాస్టార్ ఆఫ్ ఇండియా బన్నీ’’ అని రాసుకొచ్చారు. కాగా, అల్లు అర్జున్, రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన సినిమా ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక దీనిపై ఆర్జీవీ వరుస పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్జీవి ట్వీట్ నెట్టింట చర్చకు దారితీస్తోంది.
Read Aslo..
ఒక్క మాటలో ‘పుష్ప-2’ రివ్యూ చెప్పేసిన బ్రహ్మాజీ.. అవన్నీ చూడొద్దంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్