- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV: పుష్ప-2 సినిమాపై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. కాంట్రవర్సీకే కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఈ దర్శకుడు శారీ(sharee) సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఆర్జీవీ తాజాగా పుష్ప-2 (Pushpa-2) గురించి ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికన ఈ డైరెక్టర్ ఇలా రాసుకొచ్చారు.
‘పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2.. సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరు కాదు. “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం.
ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమా ఏ డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి. అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపు ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ?
ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?
ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చు లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా? మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది.. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!’ అని ఆర్జీవీ ట్వీట్లో రాసుకొచ్చారు.
Read More...
Pushpa-2 విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు లీక్..!