Rashmika Mandanna: నా లైఫ్‌లో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేసిన సినిమా అదే: రష్మిక మందన్న

by Kavitha |
Rashmika Mandanna: నా లైఫ్‌లో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేసిన సినిమా అదే: రష్మిక మందన్న
X

దిశ, సినిమా: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ తర్వాత ‘గీత గోవిందం’, ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘సీతారామం’, ‘వారసుడు’, ‘పుష్ప-2’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ‘పుష్ప’ సినిమాతో రష్మిక ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ ‘యానిమల్’ సినిమాలో నటించి బాలీవుడ్‌లో కూడా స్టార్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ‘రెయిన్ బో’, ‘ఛావా’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలా ఓ పక్కా మూవీలు చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “‘ఛావా’ కోసం నన్ను వారి ఆఫీస్‌కు పిలిచారు. సినిమా గొప్పగా ఉంటుందని చెప్పారు. కానీ మనసులో దక్షిణాదికి చెందిన నేను మహారాష్ట్ర రాణిగా నటించగలనా..? అనే ఆలోచన ఉంది. కానీ, స్క్రిప్ట్ విన్న వెంటనే నేను సినిమాకు ఓకే చెప్పడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. నా జీవితంలో అతి తక్కువ సమయంలో ప్రాజెక్టును అంగీకరించడం ఇదే ఫస్ట్ టైం” అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed