Mega hero: అమ్మాయి గెటప్‌లో మెగా హీరో చిన్ననాటి ఫొటో.. ఆకట్టుకుంటోన్న క్యూట్ లుక్స్

by Anjali |   ( Updated:2024-12-16 12:04:50.0  )
Mega hero: అమ్మాయి గెటప్‌లో మెగా హీరో చిన్ననాటి ఫొటో.. ఆకట్టుకుంటోన్న క్యూట్ లుక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలవాల్సిందే. వారు తీసుకునే ఫుడ్ గురించైనా, వాడే దుస్తులు, వాటి కాస్ట్.. హ్యాండ్ బ్యాగ్స్, ప్రముఖ హీరోల వాచెస్, చెప్పుల నుంచి సినీ సెలబ్రిటీలు ప్రయాణించే వాహానాల వరకు ఇలా.. ప్రతి ఒక్కటి సినీ ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పుకోవచ్చు. ఇకపోతే సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు(Childhood photos) కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తూనే ఉంటాం.

ఆ పిక్స్ చూడానికి ఎంతో చూడముచ్చగా ఉంటాయి. దీంతో తన అభిమాన నటీనటుల్ని చిన్ననాటి ఫొటోలో చూసుకుంటూ తెగ మురిసిపోతుంటారు ఫ్యాన్స్. ఇకపోతే తాజాగా మెగా మేనల్లుడి చిన్నప్పటి ఓ క్యూట్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో సాయి దుర్గా తేజ్(Sai Durga Te) అమ్మాయి గెటప్‌లో చాలా క్యూట్‌గా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా సంబరాల ఏటిగట్టు(Sambarala Etigattu) మూవీ గ్లింప్స్ లాంచ్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌(Global star Ram Charan)తో పాటు సాయి ధరమ్ తేజ్ పేరెంట్స్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యాంకర్ సుమ(Anchor suma) సడెన్‌గా తేజ్ చిన్నప్పటి ఫొటో చూపించి.. ఆటపట్టించింది. ఇక తేజ్ దీని గురించి మాట్లాడారు. నన్ను ఎందుకు అమ్మాయిలా రెడీ చేశావమ్మా అని అమ్మను అడిగితే.. ప్రతి ఒక్కరికి కూమార్తె ఉండాలని కోరిక ఉంటుందని.. నేను నీకు అలా గెటప్ వేసి కూతురిగా చూసుకున్నానని సమాధానమిచ్చిందని తెలిపాడు. అలాగే కేవలం మన ఇంట్లోనే కాదు.. బయట అమ్మాయిలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పిందని అన్నాడు. ప్రజెంట్ తేజ్ కామెంట్స్‌తో పాటు చిన్నప్పటి అమ్మాయి గెటప్ పిక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.


Also Read:

రెబల్ స్టార్‌కు ప్రమాదం.. షూటింగ్‌లో గాయపడ్డ ప్రభాస్‌

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed