Raidurgam: బొమ్మ తుపాకీతో బెదిరించి బార్‌‌ను దోచుకున్న కేసులో BIG ట్విస్ట్

by Gantepaka Srikanth |
Raidurgam: బొమ్మ తుపాకీతో బెదిరించి బార్‌‌ను దోచుకున్న కేసులో BIG ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బొమ్మ తుపాకీ(Fake Gun)తో బెదిరించి బార్‌లో భారీ దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అదుపులోకి తీసుకొని అతని నుంచి రూ.5 లక్షల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం రాయదుర్గం పోలీసులు(Raidurgam Police) బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 9వ తేదీన రాయదుర్గంలోని తేవర్ కిచెన్ అండ్ బార్‌(Tevar Kitchen and Bar)లో ఇద్దరు వ్యక్తులు బొమ్మ తుపాకీతో బెదిరించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. అంతుముందు రోజు వరకు వాళ్లిద్దరు అదే బార్‌లో క్యాషియర్‌గా పనిచేసినట్లు సమాచారం. బార్ యజమాని వారిని విధుల నుంచి తొలగించడంతోనే ఆ ఇద్దరు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులు ఇద్దరి పేర్లు బిస్వజిత్ పాండా, సుభం కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed