కీలక నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. ప్లీజ్ వద్దు అంటూ తల పట్టుకుంటున్న మెగా ఫ్యాన్స్!

by Hamsa |   ( Updated:2024-04-29 14:38:35.0  )
కీలక నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. ప్లీజ్ వద్దు అంటూ తల పట్టుకుంటున్న మెగా ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులే అవుతున్నప్పటికీ రిలీజ్‌కు నోచుకోవడం లేదు. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ తప్ప మరే అప్డేట్ రాలేదు.

అయితే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని అనుకునేలోపే ఎలక్షన్స్ రావడంతో వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ పూజా కార్యక్రమాలు కాకపోవడంతో సెట్‌పైకి రాలేదు. అయితే ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ ఎలాగు వాయిదా పడింది కాబట్టి.. బుచ్చిబాబు తెరకెక్కించి మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఊహించారు.

తాజాగా, రామ్ చరణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు నెలల పాటు చరణ్ గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాక బుచ్చిబాబు మూవీ సెట్‌లో జాయిన్ కావాలని నిర్ణయించుకున్నాడని టాక్. అంతేకాకుండా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా.. ఏకంగా ఏడాది సమయం తీసుకోవడం మూర్ఖమైన నిర్ణయం అని అంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం ప్లీజ్ రామ్ చరణ్ అలా చేయకు? అని తలలు పట్టుకున్నారు. సినిమా తొందరగా కంప్లీట్ చేస్తే హిట్ టాక్ రావడం నీకు ప్లస్ అవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Read More...

అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. నెట్టింట ఫొటోలు వైరల్

Advertisement

Next Story