- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajinikanth: జైలర్-2 షూటింగ్‌లో రజినీకాంత్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ఇటీవల ‘వేట్టయన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టీ.జె. జ్ఞానవేల్ (T.J. Gnanavel) దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేక పోయింది. ఇక ప్రజెంట్ ఆయన ‘కూలీ’ చిత్రంతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ (jailer) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 2023లో వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినీ క్రిటిక్ మనోబాల విజయ్ బాలన్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘X’ వేదికగా ‘జైలర్ పార్ట్ 2 ప్రోమో షూట్ డిసెంబర్ 5న స్టార్ట్ కాబోతుంది’ అంటూ ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా రజినీకాంత్ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రోమోను రిలీజ్ చేయబోతున్నట్లు కూడా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా.. తాజాగా తలైవా ప్రోమో షూట్ కోసం ఈవీపీ ఫిలిమ్ సిటీకి వెళ్తుండగా ఇళయరాజా (Ilayaraja)తో కలిసి ఫొటో దిగారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More...
‘చత్రపతి శివాజీ మహారాజ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన స్టార్ హీరో (ట్వీట్)