అమర్-ప్రశాంత్ మధ్య గొడవ.. నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపనున్నాడా!

by Hamsa |
అమర్-ప్రశాంత్ మధ్య గొడవ.. నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపనున్నాడా!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 త్వరలో ఫైనల్‌కు చేరుకోబోతున్న విషయం తెలిసిందే. దీంతో కంటెస్టెంట్స్ చాలా వైల్డ్‌గా ఆడుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ సీజన్‌లో మొదటి నుంచి అమర్ దీప్, ప్రశాంత్ ల మధ్చ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎపిసోడ్‌ హౌస్‌లో ఆకరి నామినేషన్స్ కావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓ టాస్క్ ఆడుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ఎవ్వరూ ఊహించని విధంగా గొడవ జరిగిందట. తెలుగు బిగ్‌బాస్ హిస్టరీలో ఎన్నడూ జరగని విధంగా ఇద్దరు ఫిజికల్‌గా కొట్టుకున్నారట. ఈ గొడవలో ప్రశాంత్, అమర్ మెడ పట్టుకోగా.. అమర్ గట్టిగా రైతుబిడ్డను కొరికాడట. ఈ గొడవలో వీరిద్దరికి గాయాలైనట్లు సమాచారం.

అయితే ఇదే గొడవ హిందీ బిగ్‌బాస్‌లో జరిగితే.. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపుతారు. అలా కొంత మంది కంటెస్టెంట్స్‌ను పంపేశారట. అయితే ఇప్పటి వరకు తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో అలా జరగలేదు. కానీ ఇప్పుడు అంత పెద్ద గొడవ జరగడంతో వీకెండ్‌లో నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి ప్రశాంత్, అమర్‌లను బయటకు పంపే ఛాన్స్ ఉందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. టైటిల్ రేస్‌లో వీరిద్దరు ఉంటారనుకుంటే ఇప్పుడు రెడ్ కార్డ్ ఇస్తే బిగ్‌బాస్ రేటింగ్ కూడా పడిపోతుందని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed