Pushpa-2: భారత సినీ చరిత్రలో పుష్ప-2 సంచలన రికార్డు.. ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!

by Hamsa |   ( Updated:2024-12-07 13:28:41.0  )
Pushpa-2:  భారత సినీ చరిత్రలో పుష్ప-2 సంచలన రికార్డు.. ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule ). అయితే ఈ సినిమా సూపర్ హిట్ పుష్పకు సిక్వెల్‌గా వచ్చింది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2’(Pushpa 2: The Rule ) చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్‌లను మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలిరోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, ఇండియాలో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘పుష్ప-2’ మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. ఆర్ఆర్ఆర్ రెండో ప్లేస్‌లో ఉంది. ఇక ప్రభాస్ బాహుబలి, సలార్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed