- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: విడుదలకు ముందే కలెక్షన్స్‌లో పుష్ప 2 సరికొత్త రికార్డ్..
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన పుష్ప 2 ( Pushpa 2). ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే వినిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 5న మూవీ విడుదల కానుంది. ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేస్తుండటంతో ఇప్పటికే బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఎవరు ఊహించలేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి.
ఇండియాలోనే కాక అమెరికా, ఇతర దేశాల్లో కూడా పుష్ప 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోతున్నాయి. విడుదలకి ముందే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 కొత్త రికార్డు క్రియోట్ చేసింది. ఇప్పటికే, కేవలం అమెరికాలోనే 2 మిలియన్ డాలర్స్ పైనే కలెక్ట్ చేసింది. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ లెక్కన చూస్తుంటే ఫస్ట్ డే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు . పుష్ప హవా చూస్తుంటే రూ. 1000 కోట్లు ఈజీగా మొదటి వీకెండ్ లోపే వస్తాయని అంటున్నారు ఫ్యాన్స్.