Prabhas: స్పిరిట్‌లో ప్రభాస్ లుక్ చూశారా.. మతి పోవాల్సిందే

by sudharani |   ( Updated:2024-12-11 13:00:01.0  )
Prabhas: స్పిరిట్‌లో ప్రభాస్ లుక్ చూశారా.. మతి పోవాల్సిందే
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. టి-సిరీస్ (T-Series), భద్రకాళి పిక్చర్స్ (Bhadrakali Pictures) సంయుక్తంగా హై బడ్జెట్ (High Budget) తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింట్ వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుండగా.. ఇక ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ (Music Works) స్టార్ట్ చేశారు. అయితే.. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ (Police Officer) పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా.. ఇప్పటికే ప్రభాస్ పోలీస్ గెటప్‌లో ఉన్న ఫొటోస్ కూడా నెట్టింట వైరల్‌గా మారి మంచి రెస్పాన్స్ (Response) దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మరో ఫొటో చక్కర్లు కొడుతోంది. ఇందులో రెబల్ స్టార్ (Rebel Star) పోలీస్ యూనిఫార్మ్ ((Police Uniform)) లో సిగరెట్ (cigarette) తాగుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అయితే.. ఇది డార్లింగ్ అభిమానులు ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసినట్లు తెలుస్తుండగా.. ‘స్పిరిట్’లో లుక్ ఇంతే సాలిడ్‌గా ఉంటే బాగుండు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story