- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లేడీ బాస్ లుక్‌లో కిర్రాక్ అనిపిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. అబ్బో సూపర్ అంతే అంటున్న ఫ్యాన్స్

దిశ, సినిమా: ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’(Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’(Butta Bomma) సాంగ్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.
అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్‌గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్‌లు కరువయ్యాయి. దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐదు చిత్రాలతో అలరించడానికి మన ముందుకు రానున్నది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా పూజా హెగ్డే ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో గ్రే కలర్ సూట్, ప్యాంట్, షర్ట్ వేసుకుని లేడీ బాస్‌లుక్‌లో కిర్రాక్ అనిపించింది. అంతేకాకుండా హెయిర్ లీవ్ చేసుకుని థిక్ మెరూన్ లిప్ స్టిక్‌తో వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు అబ్బో ఈ డ్రెస్‌లో సూపర్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.