Malavika Mohanan: ఆ పార్ట్ చూపిస్తూ ప్రభాస్ బ్యూటీ హాట్ ఫొటో షూట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

by Hamsa |
Malavika Mohanan: ఆ పార్ట్ చూపిస్తూ ప్రభాస్ బ్యూటీ హాట్ ఫొటో షూట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘పట్టం పోల్’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించినంత పాపులారిటీ రాలేదు. కొద్ది కాలం తర్వాత అమ్మడు నటన, అందంతో క్రేజ్‌ను పెంచుకుంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు రావడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక తమిళ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన ఆమె ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇటీవల విక్రమ్(Vikram) సరసన నటించిన ‘తంగలాన్’(Thangalan) బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు స్టార్‌గా మారిపోయింది.

ప్రస్తుతం ‘ది రాజాసాబ్’(The Rajasaab) మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. సంజయ్ దత్(Sanjay Dutt) విలన్‌గా నటిస్తున్నాడు. దీనిని పిపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రానుంది. ఈక్రమంలో.. మాళవిక వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

తాజాగా, మాళవిక తన ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘‘నా ఆత్మ చాలా సంతోషంగా ఉన్న చోట, దట్టమైన అడవిలో, అత్యంత అందమైన జలపాతం కింద నా ముఖం మీద పొగమంచు పడుతూ, ప్రతి శ్వాసలో అడవి సువాసనను అనుభవిస్తూ ఉన్నాను. బంగారు కిరణాలతో పందిరి గుండా సూర్య కాంతి నా ముఖం మీద పడుతుంటే చాలా సంతోషంగా ఉందని, ఈ అద్భుతమైన ప్రకృతి అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. మేము ఒక సరస్సు కి వచ్చాము. చిన్న ప్రవాహాల మీదుగా దూకుతున్న జలపాతంలోకి మేము దిగాము’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటోల్లో రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె కాటుక కళ్లతో నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. వాటిని చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story

Most Viewed