స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే పెళ్లి.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు కూడా హాజరు!

by Hamsa |   ( Updated:2023-09-25 05:05:24.0  )
స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే పెళ్లి.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు కూడా హాజరు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పూజా హెగ్డే ఒకప్పుడు తన అందంతో అందరినీ కట్టిపడేసింది. స్టార్ హీరోల చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడుకి ఏ ఆఫర్ రావడం లేదు. అంతేకాకుండా వచ్చినవి కూడా ఏదో కారణం వల్ల మిస్ అయిపోతున్నాయి. దీంతో ఈ భామ సినీ కెరీర్ డేంజర్‌లో పడినట్లుగా తెలుస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ ‘కిసీకి భాయ్ కిసీకి జాన్’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా, సోషల్ మీడియాలో బుట్ట బొమ్మ కు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పూజా హెగ్డే ఓ స్టార్ క్రికెటర్ తో ప్రేమలో ఉందట. ఇటీవల వీరిద్దరు కలిసి ముంబయి‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. అంతే కాదు త్వరలో వీరిద్దరూ వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ క్రికెటర్ పేరు మాత్రం బయటకు రాలేదు. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు అతడెవరో అని తెగ వెతుకుతున్నారు. మరి ఈ రూమర్‌లో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలంటే స్వయంగా పూజా హెగ్డే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Next Story