ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే సత్తా చాటుతోన్న పవన్ కల్యాణ్ ‘OG’!

by Hamsa |   ( Updated:2023-08-18 08:58:41.0  )
ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే సత్తా చాటుతోన్న పవన్ కల్యాణ్ ‘OG’!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ చిత్రం నుంచి వస్తున్న లీకులు, అప్డేట్స్ పవన్ ఫ్యాన్స్ ని కుదురుగా ఉండనీయడం లేదు.

తాజాగా, ఓజీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. యూఎస్ బిజినెస్ డీల్‌ను నిర్మాతలు క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ఓజీ’ ఓవర్సీస్ హక్కులను 2.9 మిలియన్ డాలర్లు పెట్టి సొంతం చేసుకున్నారట. గతంలో విడుదలైన అజ్ఞాతవాసి తర్వాత ఆ రేంజ్’లో రేటు పలికిన పవన్ చిత్రం ఓజీనే అని తెలుస్తోంది. ఓజీకి ఉన్న హైప్ వల్లనే అంత మొత్తంలో అమ్ముడు పోయినట్లు టాక్. దీంతో ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న ఓజీ నుంచి అప్డేట్ ఇస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

Read More : సమంత, విజయ్‌ దేవరకొండ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Advertisement

Next Story