- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహారాణి లుక్‌లో ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, సినిమా: ‘బావా’(Bava) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామ మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో సినిమాల్లో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. ఇక ఇక్కడ కూడా అంత ఫేమ్ రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. అంతేకాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది.
అయితే ఇప్పటికీ ఈ బ్యూటీ అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. సినిమాలకు చెక్ పెట్టెసిన తర్వాత ప్రణీత సోషల్ మీడియా(Social Media)కే పరిమితమయింది. అక్కడ నిత్యం తన లేటెస్ట్ ఫొటోలు, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ప్రణీత శుభాష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ డ్రెస్‌లో మహారాణిలో రెడీ అయి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు గార్జియస్, సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.