- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరో కుటుంబానికి సానుభూతి తెలిపిన పవన్ కల్యాణ్
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) తల్లి సరోజ కన్నుమూసిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో సుదీప్‌కు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు ధైర్యం చెబుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘నటుడు కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. సరోజ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని సుదీప్ గారు చెప్పారు. మాతృవియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
శ్రీ @KicchaSudeep గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి pic.twitter.com/LPxifat7Pt
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 20, 2024