Pavala Shyamala : ఆత్మహత్యనే గతి.. కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నటి

by M.Rajitha |   ( Updated:2025-01-11 14:38:37.0  )
Pavala Shyamala : ఆత్మహత్యనే గతి.. కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నటి
X

దిశ, వెబ్ డెస్క్ : తనకిక ఆత్మహత్యనే గతి అంటూ ఓ తెలుగు సీనియర్ నటి కన్నీళ్ళు పెట్టుకుంది. సీనియర్ నటి పావలా శ్యామల( Pavala Shyamala) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల మెప్పును పొందింది. అయితే ప్రస్తుతం తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దీన స్థితిలో ఉన్నానంటూ ఏడుస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 50 ఏళ్లుగా తాను ఆర్టిస్టుగా బతికానని, గత మూడేళ్లుగా తీవ్రమయిన కష్టాలు ఎదుర్కొంటున్నాను అన్నారు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా తనను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పెద్ద హీరోలు, హీరోయిన్లతో నటించాను.. ఇపుడు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నానంటూ కంటతడి పెట్టారు. ఆనందంగా నన్ను చంపేయండి, ఎవరి మనసు కరగడు కదా అంటూ పావలా శ్యామల ఆవేదన చెందారు.

Next Story