OTT Movie updates:సినీ ప్రియులకు గుడ్ న్యూస్.ఓటీటీలోకి కొత్త మూవీలు

by Kavitha |   ( Updated:2024-09-11 14:39:51.0  )
OTT Movie updates:సినీ ప్రియులకు గుడ్ న్యూస్.ఓటీటీలోకి కొత్త మూవీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో విడుదలైన సినిమా.. 15 నుంచి 20 రోజుల మధ్యనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీంతో ప్రేక్షకులు ఎక్కువగా మూవీస్‌లను ఓటీటీల్లోకి చూడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వారు కూడా త్వరత్వరగా సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పే వార్త వింటే సినీ ప్రియులు ఎగిరిగంతేస్తారు. అదేంటంటే.. రేపటి నుంచి ఓటీటీలోకి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రేపటి నుంచి (సెప్టెంబర్ 12) నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మెగా డాటర్ నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా కూడా రేపటి నుంచే (సెప్టెంబర్ 12) ఇతర ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story