ఎన్టీఆర్ సార్ మా అబ్బాయిని కాపాడండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

by Kavitha |
ఎన్టీఆర్ సార్ మా అబ్బాయిని కాపాడండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో డిగ్రీ వరకు చదివిన కౌశిక్ ప్రస్తుతం బోన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అయితే అతని తల్లి క్యాన్సర్‌తో పోరాడుతున్న తన కుమారుడిని జూ. ఎన్టీఆర్ రక్షించాలని వేడుకుంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. “సార్ మా అబ్బాయిని ఆదుకోండి. వైద్యం కోసం రూ.60 లక్షలు అవుతుంది. మా అబ్బాయి మిమ్మల్ని చూడటానికి చాలా ఆత్రుత పడుతున్నాడు. చూస్తాననే నమ్మకంతో ఉన్నాడు. కలిసేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి” అని కౌశిక్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. దీంతో ఎన్టీఆర్ అతడిని కలవాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా నిన్న దేవర సినిమా చూసి చచ్చిపోతా సినిమా విడుదల అయ్యే వరకు తనను బతికించాలంటూ క్యాన్సర్ పేషెంట్ తన చివరి కోరికను కోరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story