తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం సమావేశం ప్రారంభం

by Y. Venkata Narasimha Reddy |
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం సమావేశం ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీనివాస సీ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, వర్సిటీ విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభంపై చర్చించి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ఏడాది దసరా నుంచే తరగతుల నిర్వహణ ప్రారంభిసుందని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఈ స్కిల్ వర్సిటీలో మొత్తం 20 కోర్సులు ప్రారంభించాలని భావించినప్పటికి.. ఈసారి 6 కోర్సులను ప్రారంభిస్తామని సీఎస్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో తాత్కాలికగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా లేక న్యాక్ లేదా నిథమ్‌లో స్కిల్ యూనివర్సిటీని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపై నేటీ సమావేశంలో స్పష్టత రానుంది.

Advertisement

Next Story

Most Viewed