- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల టైమ్‌లో నిహారిక పవన్ కల్యాణ్‌కు శాపంగా మారనుందా..?
దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు. వారాహి విజయ యాత్ర ఫస్ట్ ఫేజ్‌ను కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా సమయం దొరకినప్పుడల్లా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫ్యాన్స్‌కు అప్డేట్స్ ఇస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆ క్రమంలో పవన్ కల్యాణ్ మూడవ భార్య అన్నా లెజినోవాకు విడాకులు ఇస్తునట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోను షేర్ చేస్తూ రూమర్స్‌కు చెక్ పెట్టారు.
తాజాగా, పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక చేసిన పని వల్ల పవన్‌కు మరో శాపంగా మారబోతోందని కొంత మంది మెగా హేటర్స్ కామెంట్లు చేస్తున్నారు. నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో ఆ విషయం తెలిసిన వారు పవన్ కల్యాణ్‌పై పలు విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్నారు.
ఇంట్లో ఉన్న కూతురునే కంట్రోల్ చేయలేని వారు ఏపీ ప్రజలకు ఏం చేస్తారని గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా నిహారికకు బాబాయ్ పోలికలు వచ్చాయని సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికలు మరో ఆరు నెలల్లో వస్తాయన్న ఈ సమయంలో ఇటు నిహారిక విడాకులు తీసుకోవడం.. అటు మూడో భార్యకు విడాకులు ఇస్తున్నాడు అనే వార్త ప్రచారంలోకి రావడం పవన్ కల్యాణ్ ను ఇరకాటంలో పెట్టినట్టు అవుతుంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు కార్నర్ చేసుకుని విమర్శలు గుప్పించేందుకు అస్త్రం దొరికినట్లే అని జనసేన నేతలు కలవరపడుతున్నారు. ఏది ఏమైనా నిహారిక విడాకులు పవన్ మెడకు చుట్టుకున్నటే అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది.
Read More: రాత్రి పబ్‌లు, పగలు మేకప్‌లు మాజీ కోడలిపై మామ షాకింగ్ కామెంట్స్?