Akira Nandan: అకిరా నందన్ సినీ ఎంట్రీ.. మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్..

by Kavitha |   ( Updated:2024-09-11 14:39:26.0  )
Akira Nandan: అకిరా నందన్ సినీ ఎంట్రీ.. మెగా డాటర్  షాకింగ్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన సమయంలో నాన్నతో పాటే తిరుగుతూ అకీరా బాగా వైరల్ అయ్యాడు. దీంతో ఇతను హీరో అవుతాడని, సినిమాల్లోకి వస్తాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో రేణు దేశాయ్ అకిరా హీరో అవ్వడు అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఫ్యాన్స్ మాత్రం అకిరాని హీరోగా చూడాలని అనుకుంటుండటంతో మెగా ఫ్యామిలీకి ప్రతిసారి అకిరా సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురు అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరోమారు అకీరా సినీ ఎంట్రీపై మెగా డాటర్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఇచ్చిన ఆన్సర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ మూవీ ఓటీటీ రిలీజ్ మీట్ పెట్టగా ఈ ప్రెస్ మీట్‌లో నిహారికకు అకిరా గురించి ప్రశ్న ఎదురయింది. ఓ మీడియా ప్రతినిధి చాలా మంది కొత్తవాళ్లను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు, మీ తమ్ముడు అకిరాను పరిచయం చేసే ఉద్దేశం ఉందా అని అడగ్గా నిహారిక సమాధానమిస్తూ.. “ఇంకా అతను చాలా యంగ్. అసలు అకిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందా అని కూడా నేను ఎప్పుడూ అడగలేదు. అతను సినిమాల్లోకి వస్తాడో రాడో నాకు తెలియదు” అని తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story