సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. అమ్మాయి ఎవరో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-09-14 07:17:15.0  )
సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. అమ్మాయి ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏవో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు ఎవరి కెరీర్ వారు చూసుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే నాగచైతన్య, ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అని అటు శోభితా ధూళిపాల ఇటు నాగచైతన్య కొట్టి పారేశారు.

ఈ క్రమంలో నాగచైతన్య సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య బడా బిజినెస్ మాన్ కూతురిని పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. ఇక ఆ బిజినెస్ మాన్ ఫ్యామిలీ కూడా అక్కినేని వారికి దూరపు బంధువులని, చైకి మొదట పెళ్లి అయిందని తెలిసి కూడా ఆ అమ్మాయి నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story