Thandel : ‘తండేల్’ క్లైమాక్స్‌లో సమంతను గుర్తుచేసుకుని ఏడ్చేసిన నాగచైతన్య.. వీడియో వైరల్

by Prasanna |
Thandel : ‘తండేల్’ క్లైమాక్స్‌లో సమంతను గుర్తుచేసుకుని ఏడ్చేసిన నాగచైతన్య.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య ( Naga Chaitanya ) హీరోగా తెరకెక్కిన సినిమా " తండేల్ " ( Thandel ). మంచి హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. 2022లో బంగార్రాజు చిత్రంతో విజయం సాధించిన చైతూ ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక, ఇప్పుడు తండేల్ తో మన ముందుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో చందూ మొండేటి డైరెక్షన్ లో ఈ సినిమాని రూపొందించారు.

ఈ సినిమా ఫిబ్రవరి 7 న రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే, సినిమాలో కొన్ని సీన్స్ అందర్ని ఏడిపించేశాయి. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకొచ్చిన జనాలు నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీ ఇదే అంటూ ఆడియెన్స్ చెబుతున్నారు. " క్లైమాక్స్‌ సీన్ లో నాగ చైతన్య ప్రాణం పెట్టి నటించాడు. ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఏడుస్తూ ప్రేక్షకుల మనసును కదిలించాడంటే కచ్చితంగా ఆ సీన్ లో సమంతను గుర్తు చేసుకునే ఉంటాడు " అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

రిలీజ్ కు ముందే పాటలన్ని హిట్ అయ్యాయి. ఇక " బుజ్జి తల్లి " సాంగ్ అయితే, 100 మిలియన్ వ్యూస్ సాధించి బిగ్ హిట్ గా నిలిచింది, మ్యూజిక్ తో దేవి శ్రీ ప్రసాద్ కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమాలో ‘శివ శివ’ పాటలో సాయి పల్లవి, చైతూ లు నువ్వా .. నేనా అన్నట్టుగా డాన్స్ చేశారట. ఆ పాట గూస్ బంప్స్ తెప్పించే విధంగా తీశారట. నాగ చైతన్య కెరీర్ కి తండేల్ మూవీ పెద్ద బూస్ట్ ఇస్తుందని అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Next Story