Tollywood: మరోసారి సంక్రాంతి బరిలోకి దిగనున్న మెగాస్టార్, బాలయ్య?

by Prasanna |   ( Updated:2024-08-23 14:38:52.0  )
Tollywood: మరోసారి సంక్రాంతి బరిలోకి దిగనున్న మెగాస్టార్, బాలయ్య?
X

దిశ, సినిమా: ఈ మధ్య కథ బావుంది అనుకుంటే తప్ప థియేటర్ కి వెళ్లి ప్రేక్షకులు సినిమాలు చూడటం లేదు. ఇక స్టార్ హీరోల మూవీస్ కి కూడా ఇదే రిపీట్ అవుతుంది. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించిన ఒక్కసారి నెగటివ్ టాక్ వస్తే నష్టాలే వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, స్టార్ హీరోలు ఒకే సారి పోటీ పడితే బయ్యర్లకు భయం.. నిర్మాతలకు టెన్షన్. పెద్ద హీరోలు ఇద్దరూ ఒకే సీజన్‌లో వస్తే ఆడియెన్స్ కి కూడా నిద్ర పట్టదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి మించిన సీజన్ ఇంకోటి లేదు. ఆ టైం లో వచ్చే సినిమాలకు డిమాండ్ కొంచం ఎక్కువ. టాక్ ఎలా ఉన్నా ఆ మూడు రోజుల మాత్రం కలెక్షన్లు బాగా వస్తాయి. అందుకే పెద్ద హీరోలు సంక్రాంతినే టార్గెట్ చేస్తారు.

ఈ సారి 2025 పొంగల్ కి చిరంజీవి విశ్వంభర ఉండబోతుందని తెలుస్తుంది. ఇది రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా ఇది. తాజాగా, ఇప్పుడు బాలయ్య బాబు మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలవబోతుందని తెలుస్తుంది. బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ 2024 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అప్పటికి షూటింగ్ అవ్వకపోతే సంక్రాంతికి తీసుకొచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల చెబుతున్నారు. బాలయ్య వస్తే టఫ్ వార్ తప్పదు. ఎందుకంటే చిరంజీవి కూడా బరిలో ఉన్నారు. ఇక, ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed