- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mechanic Rocky: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ చిత్రం
దిశ, వెబ్‌డెస్క్: నవంబరు 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటావ్ టాక్ సొంతం చేసుకుంది ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) చిత్రం. మాస్‌కా దాస్ విశ్వక్ సేన్(Maska Das Vishwak Sen) కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో రవితేజ ముళ్లపూడి(Ravi Teja Mullapudi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)లు హీరోయిన్లుగా నటించగా.. జేక్స్ బిజొయ్(Jakes Bijoy) సంగీతాన్ని సమకూర్చారు. ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్(SRT Entertainments banner) పై రజనీ తాళ్లూరి(Rajini Talluri) నిర్మించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ మెకానిక్ రాకీ చిత్ర స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలై మూడు వారాలు కాకముందే ఓటీటీలో అదరగొట్టేందుకు రెడీ అయింది. ఇకపోతే విశ్వక్ సేన్ ఈ చిత్రంలో మెకానిక్ గ్యారేజ్‌తో పాటు డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంటాడు. ఈ క్రమంలో హీరో నాన్న మరణిస్తారు. అలాగే హీరోయిన్ మాయ. రాకీ దగ్గర డ్రైవింగ్ స్కూల్లో చేరుతుంది. మధ్యలో రంకిరెడ్డి(Rankireddy) అనే వ్యక్తి మెకానిక్ షెడ్డును కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమస్యకు మాయ హీరోకు దారిచూపిస్తుంది. ఎలాగో.. పూర్తి కథ ఎలా సాగనుందో తెలియాలంటే మెకానిక్ రాకీ సినిమా చూడాల్సిందే.