పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటోలు

by Kavitha |
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటోలు
X

దిశ, సినిమా: కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ మూవీ ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘తెల్లవారితే గురువారం’, ‘భాగ్ సాలే’ (Bhaag Saale), ‘ఉస్తాద్’ (Ustaad) వంటి చిత్రాల్లో నటించాడు. కానీ, అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేక పోయాయి. ఇక తాజాగా ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2)చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ సాధించాడు. ప్రస్తుతం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టి తన కెరీర్‌ను మరింత స్థిరపరచుకోవాలని చూస్తున్నాడు.

అయితే రీసెంట్‌గా ఈ యంగ్ హీరో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా కీరవాణి తనయుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. సీనియర్ యాక్టర్ మురళి మోహన్ మనవరాలు రాగను శ్రీ సింహ పెళ్లి చేసుకున్నాడు. UAEలో ఘనంగా జరిగిన ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సందడి చేశారు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story