- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mamitha Baiju: వరుస ఆఫర్స్ అందుకుంటోన్న యంగ్ హీరోయిన్.. ఈసారి ఏకంగా సూర్య సరసన!

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (Surya) ప్రజెంట్ ‘రెట్రో’ (Retro) చిత్రంతో బిజీగా ఉన్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే.. ఈ సినిమా అనంతరం సూర్య డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే.. సూర్య, అట్లూరి కాంబో మూవీకి సంబంధించిన ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ (Interesting news) నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మమితా బైజు(Mamitha Baiju)ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట మేకర్స్. అంతే కాకుండా.. ఇప్పటికే మమితకు స్క్రిప్ట్ వివరించగా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించేందుకు ఈ బ్యూటీ చాలా ఎగ్జైట్మెంట్ (Excitement) ఎదురుచూస్తుందట. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) రావాల్సి ఉంది. కాగా.. ప్రేమలు చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ ప్రజెంట్ నాలుగు, ఐదు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయింది.
Read More..
Siddu Jonnalagadda: జాక్ ‘కిస్ సాంగ్’ కు ముహూర్తం ఫిక్స్.. లేటెస్ట్ పోస్టర్ వైరల్