Malvika Mohanan: రాజాసాబ్‌’ షూటింగ్‌‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మాళవిక మోహనన్‌ (వీడియో)

by sudharani |   ( Updated:2024-12-02 12:31:27.0  )
Malvika Mohanan: రాజాసాబ్‌’ షూటింగ్‌‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మాళవిక మోహనన్‌ (వీడియో)
X

దిశ, సినిమా: ‘పట్టం పోల్’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ (Malavika Mohanan).. ఇప్పుడు ‘ది రాజాసాబ్’ (The Rajasaab) మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ మూవీకి మారుతీ (Maruti) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రజెంట్ ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీపై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా మీడియాతో చేసిన చిట్ చాట్‌లో మాళవిక మాట్లాడుతూ.. ‘‘రాజాసాబ్‌’ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇది నా తెలుగు డెబ్యూ సినిమా. అంతేకాదు ఇది నా ఫేవరేట్‌ హీరో ప్రభాస్‌ మూవీ. రాజాసాబ్‌ అవుట్‌పుట్ (Rajasab output) చాలా బాగా వచ్చింది’ అంటూ చాలా ఎగ్జైట్‌గా చెప్పుకొచ్చింది. కాగా.. తెలుగులో తన మొదటి సినిమానే డార్లింగ్ ప్రభాస్‌తో చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందంటూ చెప్పిన మాళవిక కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story