రెండు పార్టులుగా రాబోతున్న SSMB29.. బడ్జెట్‌ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by sudharani |
రెండు పార్టులుగా రాబోతున్న SSMB29.. బడ్జెట్‌ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: ఈ ఏడాది ‘గుంటూరు కారం’(Guntur Karam)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు(Superstar Mahesh Babu).. తన తదుపరి చిత్రం దర్శకధీరుడు రాజమౌళి (Director Rajamouli)తో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిట్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీ హాలీవుడ్ (Hollywood)రేంజ్‌లో అత్యంత భారీగా ఉండనుందని వార్తలు కూడా వచ్చాయి. అమెజాన్ అడవుల (Amazon forests) నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారట. అంతే కాకుండా.. ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్‌ను సైతం మార్చేసుకుని హాలీవుడ్ హీరోలా దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై తాజాగా ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బ‌ృందం.

ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కబోతున్నట్లు చెప్తూనే.. బడ్జెట్ రివీల్ చేసింది. ఈ మేరకు.. ‘సూపర్ స్టార్ #మహేశ్ బాబు గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్(Mahesh Babu's globe trotting adventure film) #SSMB29 భారీ ₹1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతుంది. ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం వహించనున్న భారతదేశపు అత్యంత ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజంట్ ఈ ట్వీట్ నెట్టింట విశేషంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ మహేశ్ బాబు సినిమా రెండు పార్టులుగా రానుందని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story