స్టేజ్‌పైనే నటుడిని హగ్ చేసుకున్న ఫ్యాన్ గర్ల్.. హీరో ఫ్రెండ్ ఏమని కామెంట్ చేశాడంటే?

by Anjali |   ( Updated:2025-03-19 15:19:19.0  )
స్టేజ్‌పైనే నటుడిని హగ్ చేసుకున్న ఫ్యాన్ గర్ల్.. హీరో ఫ్రెండ్ ఏమని కామెంట్ చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సినిమా సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Superstar Mohanlal) తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్’ (Barroz: Guardian of Treasures). ఈ ఫాంటసీ చిత్రం 2024 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. తర్వాత జనవరి 2025లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది.

ఈ చిత్రంలో మోహన్‌లాల్ బరోజ్ అనే పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు. వాస్కోడిగామా నిధిని 400 సంవత్సరాలుగా కాపాడే పాత్రలో నటించాడు. బరోజ్ సినిమా 3D ఫార్మాట్‌లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

అయితే బారోజ్ ప్రమోషన్ కార్యక్రమంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ను ఓ మహిళా అభిమాని కౌగిలించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అభిమాన నటుడిని స్టేజ్ మీద హగ్ చేసుకున్న ఆ ఫ్యాన్ గర్ల్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.

అయితే.. మెహల్ లాల్‎ను ఫ్యాన్ గర్ల్ హగ్ చేసుకోవడంపై మోహన్ లాల్ ఫ్రెండ్, యాక్టర్ జయరాం (Jayaram) ఫన్నీగా డబుల్ మీనింగ్ డైలాగ్ వేశారు. మళయాల ఇండస్ట్రీలో మోహన్ లాల్ గ్రేటేస్ట్ ప్లే బాయ్ అని.. ఆ విషయం కొందరికే తెలుసని జయరాం కామెంట్ చేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. జయరాం చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

Read More..

Mohan Babu: నేడు మోహన్ బాబు పుట్టినరోజు.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్

Next Story

Most Viewed