అంగరంగ వైభవంగా టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి.. జంట ఎంత ముద్దుగా ఉన్నారో..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-23 14:10:00.0  )
అంగరంగ వైభవంగా టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి.. జంట ఎంత ముద్దుగా ఉన్నారో..
X

దిశ, సినిమా : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కర్ణాటకలోని కొడుగులో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగినట్లు తెలుస్తుండగా.. తెలుగు సంప్రదాయంలో ఇద్దరు మూడుముళ్లతో ఒక్కటయ్యారు. కన్యాదానం, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం తంతు వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుండగా.. కంగ్రాట్స్ చెప్తున్నారు ఫ్యాన్స్. కలకాలం ఇద్దరు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు.

ఇక రహస్య, కిరణ్ కలిసి ' రాజా రాణి ' సినిమా చేయగా.. అదే సమయంలో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. కాగా కిరణ్ అబ్బవరం తర్వాతి ప్రాజెక్టు 'KA' పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ మధ్య విడుదలైన టీజర్ కు గ్రేట్ రెస్పాన్స్ రాగా మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉన్నారు అభిమానులు.

(Video Credits Tollywood-Telugu Cinema Memes Instagram Channel)

Advertisement

Next Story